రాత్రిపూట సెల్‌ఫోన్ వాడితే డేంజర్
ఈ జబ్బు వస్తుందంట: బీ కేర్ ఫుల్ నైట్ ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం వల్ల వాటి నుండి వచ్చే నీలిరంగు కాంతి విడుదలై అది టైప్–2 డయాబెటిస్కు దారితీస్తుందని తాజా అధ్యయనం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ వ్యాధిని నిర్మూలించేందుకు సరైన మందులు లేవన్నది అందరికీ తెలిసిందే. ఐతే , ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో కేవలం రక్తంలోని చక్కెర స్థాయిలను మాత్రమే అదుపులోకి తేవచ్చు. అయితే , ఆ మందులను దీర్ఘకాలికంగా వాడితే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల టైప్–2 డయాబెటిస్ రాకుండా అత్యంత జాగ్రత్త వహించాలి. టైప్–2 డయాబెటిస్ రావడానికి గల కారణాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. రాత్రిపూట ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం వల్ల వాటి నుండి నీలిరంగు కాంతి విడుదలై అది టైప్–2 డయాబెటిస్కు దారితీస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాక , ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే నీలిరంగు కాంతికి గురవ్వడం వల్ల వ్యక్తి ఆకలి పెరగడమే కాకుండా అతని జీవక్రియ మెరుగవుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. మసక కాంతి ఎక్స్పోజర్తో పోలిస్తే ...