Posts

Showing posts with the label IAS

IAS ఆఫీసర్‌కి నెటిజన్ల హ్యాట్సాప్

Image
తండ్రి మరణించినా విధులు మానలేదు ఇండియాను కబళిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రధాని నరేంద్రమోదీ, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటూ... ప్రజలు కూడా బలంగా పోరాడుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రేరణాత్మక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశా... భువనేశ్వర్‌లో... IAS ఆఫీసర్ నికుంజా ధల్...రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అలా ఆయన బిజీగా ఉండగా... ఉన్నతాధికారులు ఆయన దగ్గరకు వచ్చి... ఎలా ఉన్నారు... అని అడిగారు.బాగోగులు అడుగుతూనే...వెన్నుతట్టి... ఓదార్చుతుంటే... ఏమైంది సార్ అని అడిగారాయన. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి... అంటూ "మీ నాన్నగారు..."అని తండ్రి చనిపోయిన విషయం చెప్పారు. అంతే... నికుంజా ధల్ షాక్ అయ్యారు. నోట్లోంచీ మాటలు లేవు. ఇంటికి వెళ్లండి అని అధికారులు చెప్పడంతో... అప్పటివరకూ చేస్తున్న విధులను మిగతా వారికి తాత్కాలికంగా అప్పగించి... ఇంటికి వెళ్లారు. ఇల్లంతా విషాదం. తండ్రి మరణంతో... నికుంజా ఆ ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంప్రదాయం ప్రకారం ఏమేం చెయ్యాలో అన్నీ చేశారు. 24 గంటలు కూడా గడవలేదు. "ఏడుస్తూ ఉంటే...