IAS ఆఫీసర్‌కి నెటిజన్ల హ్యాట్సాప్

తండ్రి మరణించినా విధులు మానలేదు


ఇండియాను కబళిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రధాని నరేంద్రమోదీ, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటూ... ప్రజలు కూడా బలంగా పోరాడుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రేరణాత్మక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశా... భువనేశ్వర్‌లో... IAS ఆఫీసర్ నికుంజా ధల్...రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అలా ఆయన బిజీగా ఉండగా... ఉన్నతాధికారులు ఆయన దగ్గరకు వచ్చి... ఎలా ఉన్నారు... అని అడిగారు.బాగోగులు అడుగుతూనే...వెన్నుతట్టి... ఓదార్చుతుంటే... ఏమైంది సార్ అని అడిగారాయన. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి... అంటూ "మీ నాన్నగారు..."అని తండ్రి చనిపోయిన విషయం చెప్పారు. అంతే... నికుంజా ధల్ షాక్ అయ్యారు. నోట్లోంచీ మాటలు లేవు. ఇంటికి వెళ్లండి అని అధికారులు చెప్పడంతో... అప్పటివరకూ చేస్తున్న విధులను మిగతా వారికి తాత్కాలికంగా అప్పగించి... ఇంటికి వెళ్లారు. ఇల్లంతా విషాదం. తండ్రి మరణంతో... నికుంజా ఆ ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంప్రదాయం ప్రకారం ఏమేం చెయ్యాలో అన్నీ చేశారు. 24 గంటలు కూడా గడవలేదు. "ఏడుస్తూ ఉంటే...నాన్న తిరిగిరారు. నేను విధుల్లో పాల్గొని కరోనా సోకకుండా ప్రజలకు సేవ చేస్తే... నాన్న ఎక్కడున్నా సంతోషిస్తారు" అనుకుంటూ నికుంజా తిరిగి బయల్దేరారు. ఆఘమేఘాలపై వెళ్లి విధుల్లో చేరిపోయారు. వెంటనే ఈ విషయం పై అధికారులకు తెలిసింది. "అవునా... అప్పుడే వచ్చేశారా... కనీసం మూడ్రోజులైనా సెలవులో ఉంటారని అనుకున్నాం. గ్రేట్... హ్యాట్సాప్ టు హిమ్" అంటూ మెచ్చుకున్నారు.
1993 బ్యాచ్ IAS ఆఫీసరైన నికుంజా... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆయన్ను అంతా మెచ్చుకుంటున్నారు. ఆయన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూనే మరోవైపు... మీరే మాకు ఇన్స్‌పిరేషన్ అంటూ కామెంట్ల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే... ఇండియాలో కరోనా వైరస్ అంత వేగంగా వ్యాపించట్లేదని అంటున్నారు.

1993 బ్యాచ్ IAS ఆఫీసరైన నికుంజా... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆయన్ను అంతా మెచ్చుకుంటున్నారు. ఆయన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూనే మరోవైపు... మీరే మాకు ఇన్స్‌పిరేషన్ అంటూ కామెంట్ల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే... ఇండియాలో కరోనా వైరస్ అంత వేగంగా వ్యాపించట్లేదని అంటున్నారు.

మంగళవారం... ఒడిశా... నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ప్రభుత్వాధికారుల సెలవులన్నీ రద్దు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తోందనీ, ఇండియాలో కూడా విస్తరిస్తోంది కాబట్టి... మనం కరోనాతో యుద్ధం చేయడానికి లీవ్స్ మానుకొని మరీ పనిచెయ్యాలని నవీన్ పట్నాయక్ కోరారు. దాంతో అధికారులంతా విధుల్లో తలములకలయ్యారు. ఈ పరిస్థితుల్లో నికుంజా కూడా... విధుల్లో చేరి... భారత యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు.

Comments

Popular posts from this blog

क्रिकेट प्रेमियों के लिए अच्छी खबर, भारत और साउथ अफ्रीका की टीम जल्द हो सकती है आमने-सामने

महेन्द्र सिंह धोनी... उदय और अस्त

రాత్రిపూట సెల్‌ఫోన్ వాడితే డేంజర్