వర్క్ ఫ్రమ్ హోమ్
చక్కగా పనిచేసేందుకు సింపుల్ చిట్కాలు కరోనా వైరస్ పాపమా అని...చాలా మంది ఇళ్లలోనే బంధీలై... వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాల్సి వస్తోంది. మరైతే నిపుణులు ఏం చెబుతున్నారు, చక్కగా వర్క్ చెయ్యడం ఎలా? Work from Home : కరోనా వైరస్ కారణంగా చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలూ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యిస్తున్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా...ఆఫీస్‌లో చేసిన పనికీ, ఇంట్లో చేసిన పనికీ తేడా కచ్చితంగా ఉంటుంది. ఎంత పోల్చుకున్నా... ఆఫీస్‌లోనే పని ఎక్కువ జరుగుతుంది. ఇందుకు కారణం... ఆఫీస్ ఎన్విరాన్‌మెంటే. ఉద్యోగులు పని చెయ్యడానికి అక్కడ అన్ని ఏర్పాట్లూ ఉంటాయి. పూర్తిగా పని పైనే శ్రద్ధ పెట్టేందుకు వీలవుతుంది. అదే ఇళ్లలో అయితే...ఏకాగ్రతతో పని చెయ్యడం చాలా కష్టం. ఇంట్లో వాళ్ల సమస్యలు, రోజు వారీ పనులు ఇలాంటివి గుర్తొస్తూ... పనిపై శ్రద్ధను తగ్గించే ప్రమాదం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే... వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది...వినడానికి ఆనందంగా... చెయ్యడానికి కష్టంగా ఉండే అంశం అనుకోవచ్చు. అయినప్పటికీ... వర్క్ ఫ్రమ్ హోం ద్వారా కూడా అద్భుతాలు సృష్టించవచ్చంటున్నారు నిపుణులు. ఎలాగో ఫటాఫట్ తెలుసుకుందాం. వర్క్ ఫ్ర...