పాన్‌-ఆధార్‌ లింక్‌కు నెలాఖరే తుది గడువు

మార్చి 31 లోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా ?


పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవడం తప్పనిసరి అని ఆదాయపు పన్ను శాఖ విభాగం మరోసారి సూచించింది. ఇందుకు మార్చి 31వ తేదీ తుది గడువని తెలిపింది. గడువు లోపల పాన్-ఆధార్ లింక్ చేసుకోని పక్షంలో పాన్ కార్డు పని చేయదని గత నెలలోనే ఐటీ డిపార్టుమెంట్ హెచ్చరించింది. 

బయో మెట్రిక్ ధ్రవీకరణ, ఎన్ఎస్డీఎల్, యూటీఐటీఎస్ఎల్ పాన్ సేవా కేంద్రాల ద్వారా కూడా అనుసంధానం చేసుకోవచ్చునని ఐటీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. రెండు మార్గాల్లో లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయవచ్చునని పేర్కొంది. 

ఆధార్ కార్డును ఎస్సెమ్మెస్ ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. అలాగే ఆదాయపు పన్ను శాఖ ఈృఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ పాన్-ఆధార్ లింక్ కోసం పలుమార్లు గడువులు ఇచ్చింది. ఈసారి గడువు పెంపొందించే అవకాశాలు లేవు. కాబట్టి ముందే లింక్ చేసుకోవడం మంచిది. 

మరిచిపోకండి: పాన్-ఆధార్ లింక్‌కు 31 డెడ్‌లైన్ లేదంటే పాన్ పనిచేయదు 

మీరు మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా? ఇంకా లింక్ చేయలేదా? పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. పాన్ కార్డు ఉన్నవాళ్లందరూ తమ ఆధార్ నెంబర్లను పాన్ కార్డుతో లింక్ చేయాల్సిందే. పాన్-ఆధార్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా చెబుతోంది. అనేక సార్లు డెడ్ లైన్స్ విధించింది. ఇప్పటికే చాలా సార్లు చివరి తేదీలను పొడిగించింది. అయినా ఇప్పటివరకు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయనివాళ్లున్నారు. ఈసారి ప్రభుత్వం చివరి తేదీ పొడిగించే అవకాశం కనిపించట్లేదు. మార్చి 31 లోగా ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయాల్సిందే. లేకపోతే ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని, వాటిని ఉపయోగించడానికి వీల్లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT ప్రకటించే అవకాశముంది. డెడ్‌లైన్ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 'పనిచేయనివి'గా గుర్తించాలని ఫైనాన్స్ బిల్లులో సైతం వెల్లడించింది ప్రభుత్వం. 

PAN-Aadhaar Link: పాన్ కార్డ్- ఆధార్ నెంబర్ లింక్ చేయండిలా 

పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి 4 మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోండి. 

1. SMS: మీరు మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి. 

UIDPAN<12><10> 

Umang App: పాన్ కార్డు నుంచి పాస్‌పోర్ట్ వరకు... ఏం కావాలన్నా ఈ యాప్‌ చాలు Umang App: పాన్ కార్డు నుంచి పాస్‌పోర్ట్ వరకు... ఏం కావాలన్నా ఈ యాప్‌ చాలుAadhaar Address: ఆధార్‌లో చిరునామా మార్చాలా? ఈ 45 అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు Aadhaar Address: ఆధార్‌లో చిరునామా మార్చాలా? ఈ 45 అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వొచ్చుMarch 31 Deadline: ఈ 6 పనులకు మార్చి 31 డెడ్‌లైన్... గుర్తుంచుకోండి. 

March 31 Deadline: ఈ 6 పనులకు మార్చి 31 డెడ్‌లైన్... గుర్తుంచుకోండి Aadhaar Address Update: ఆధార్ కార్డులో అడ్రస్ ఆన్‌లైన్‌లో మార్చండిలాAadhaar Address Update: ఆధార్ కార్డులో అడ్రస్ ఆన్‌లైన్‌లో మార్చండిలాPan Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్... తీసుకోండి ఇలా Pan Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్... తీసుకోండి ఇలాAadhaar Card: ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం ఈ 32 ఐడీ ప్రూఫ్స్ ఇవ్వొచ్చుAadhaar Card: ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం ఈ 32 ఐడీ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు 
ఉదాహరణ: UIDPAN 111122223333 AAAPA9999Q 
2. Online: ముందుగా incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 'Linking Aadhaar' లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్‌కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. 
3. Income Tax Returns (ITR): మీరు ఇ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా మీ పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి. 
4. PAN Card Application: ఇక కొత్తగా పాన్ కార్డు తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేయించేవాళ్లు దరఖాస్తులోనే ఆధార్ నెంబర్ వివరిస్తే సరిపోతుంది.

Comments

Popular posts from this blog

Top stories on October 2 in a capsule

Top stories on 8 January in a capsule