కరోనాపై మోదీకి కేసీఆర్ సలహాలు
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
హైదరాబాద్‌లోని సీసీఎంబీని కరోనా ల్యాబ్‌గా ఉపయోగించాలని ప్రధాని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇక్కడ టెస్ట్‌లు నిర్వహించవచ్చని, ఒకేసారి వెయ్యి శాంపిల్స్ పరీక్షించే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. కరోనా వ్యాపించకుండా తెలంగాణ తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలను ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారు. కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. కొద్దిరోజుల పాటు విదేశాల నుంచి విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని మోదీని కేసీఆర్ కోరారు. రైల్వేస్టేషన్ల వద్ద కూడా పరీక్షలు నిర్వహించాలని, రైల్వేస్టేషన్లు, బోగీల్లో హై శానిటైజేషన్ చేయాలని కేసీఆర్ సూచించారు.
Comments
Post a Comment