పాదాలతో శరీరానికి మసాజ్
శరీరంలోని భాగాలన్నీ పాదానికి అనుసంధానమై ఉంటాయని అందరూ అంటుంటే వింటూ ఉంటాం. అయితే పాదంలో ఎక్కడ ఏ భాగం ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరికీ దీనిపై అవగాహన లేకపోవడమే. అందుకే పాదంలో ఎక్కడ మసాజ్ చేస్తే ఏ అవయవం రిలాక్స్ అవుతుందో తెలుసుకోండి.
తల: పాదంలోని బొటనవేలు తలకు కనెక్ట్ చేసి ఉంటుంది. బొటనవేలుకి మసాజ్ చేయడం వల్ల తలనొప్పి, అలసట, చిరాకు నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా బ్రైన్ షార్ప్‌గా ఉండేలా చేస్తుంది. ఎప్పుడూ పాజిటివ్ మైండ్‌తో ఉండేలా చూస్తుంది.
కళ్ళు: దృష్టి సమస్య, కళ్ళలో పుండ్లు ఏర్పడడం, ఎరుపు రంగు, నొప్పితో సహా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. రెండవ, మూడవ కాలివేళ్లకి దిగువన ఉన్న పాదాల ప్రాంతానికి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
చిన్నప్రేగు: ఫుట్ మసాజ్ వల్ల ప్రయోజనం పొందే తర్వాతి అవయవం పేగు. మడమ పైన పాదం మధ్యలో ఉన్న భాగాన్ని మసాజ్ చేయడం వల్ల మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అజీర్ణంతో బాధపడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఊపిరితిత్తులు: పాదంలోని అడుగున బంతుల మధ్య ప్రాంతానికి ఇవి అనుసంధానించబడినట్లు చెబుతున్నారు. అస్తమాతో బాధపడుతున్న వారికిఇక్కడ మసాజ్ చేస్తే గొప్పరిలీఫ్‌గా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మడమ : పాద మడమ బాగంలో మసాజ్ చేస్తే రిప్లెక్సాలజీ ప్రకారం తొడ వెనుక భాగపు నరాలు, వెనుక వీపు మధ్య పరస్పర సంబంధం ఉంది. వెన్నునొప్పితో బాధపడేవారికి మడమలను మసాజ్ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
మెడ: ఈ కాలంలో మెడ నొప్పులు సర్వసాధారణం. పాదం బొటనవేలు కింద ఉన్న ప్రాంతాన్ని మసాజ్ చేయడం వల్ల మెడభాగంలోని నొప్పులు దూరమవుతాయి. ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఈ ప్రాంతాన్ని వేళ్ళతో మసాజ్ చేయాలి.
గుండె: అన్ని అవయవాలకన్నా గుండె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండె దడ లేదా ఛాతి నొప్పిని ఎదుర్కొంటున్న ఎవరైనా వెంటనే వైద్యుడిని కలవాలి. ఈలోపు కుడిపాదంలోని చిటికిన వేలు కింది భాగంలో మసాజ్ చేయాలి. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా ప్రసరణ వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి.
మోకాళ్లు: ప్రతి మడమ వెలుపలి భాగం మోకాళ్ళకు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. మోకాలి నొప్పి లేదా దీర్ఘకాలిక మోకాలి నొప్పితో బాధపడుతున్న వారు ఈ ప్రాంతంలో మసాజ్ చేయాలి.
కడుపు: ఈ ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా అజీర్ణం, ఉబ్బరం లేదా వాయువుకు మంచిది.
థైరాయిడ్: ఈ జెనరేషన్‌లో చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరికీ థైరాయిడ్ సమస్య ఉంటుంది. కానీ థైరాయిడ్ గ్రంథి మొత్తం ఆరోగ్యాన్ని పెంచడానికి ఫుట్‌మసాజ్‌ను ఉపయోగించవచ్చు. థైరాయిడ్ ప్రయోజనం కోసం పాదంలోని లోపలి భాగాన్ని మసాజ్ చేయాలి.
లివర్: కుడిపాదంలో ఫొటోలో చూపించిన విధంగా ఈ ప్రాంతానికి మసాజ్ చేయడం వల్ల కాలేయం పనితీరు మెరుగవుతుంది. ఆ అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Comments
Post a Comment